రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది. దోహ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 367 గ్రాముల బంగారం పేస్టును అధికారులు పట్టుకున్నారు.
పేస్టు రూపంలో బంగారం స్మగ్లింగ్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో బంగారం పేస్ట్
విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లరు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వారి ప్లాన్లను చిత్తు చేస్తూ కస్టమ్స్ అధికారులు వాళ్ల ఆట కట్టిస్తూనే ఉన్నారు.
పేస్టు రూపంలో బంగారం స్మగ్లింగ్
దోహ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయం నుంచి బయటకి వచ్చే క్రమంలో మహమూద్ అనాస్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతణ్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా పేస్టు రూపంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం గుట్టు రట్టయింది.
రూ.15.56 లక్షల విలువైన బంగారం పేస్టును భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల్లోనే దాదాపు తొమ్మిది కిలోల బంగారం పట్టుబడటం వల్ల భద్రతాధికారుల్లో కలకలం రేగుతోంది.
- ఇదీ చూడండి:వేగం పెరగదు.. ముందుకు సాగదు..!