తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఏడాది బాటసింగారంలోనే మామిడి సీజన్: నరసింహారెడ్డి

This year is mango season in Batasingaram fruit market: రంగారెడ్డి జిల్లాలోని అబ్దూల్లాపూర్​మెట్​ మండలం బాటసింగార పండ్ల మార్కెట్​ మామిడిపల్లికి వెళ్తుందన్న తప్పుడు సమాచారంపై మార్కెట్​యార్డ్ కార్యదర్శి స్పందించారు. ఈ సమస్యపై స్పష్టమైన సమాచారాన్ని అందించారు.

Batasingaram Fruit Market
బాటసింగారం ఫ్రూట్ మార్కెట్

By

Published : Dec 30, 2022, 3:47 PM IST

రంగారెడ్ది జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బాటసింగారం పండ్ల మార్కెట్ తరలింపుపై వచ్చే వదంతులను నమ్మొద్దని మార్కెట్ కార్యదర్శి నరసింహారెడ్డి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు మామిడి సీజన్ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. కమీషన్ ఏజెంట్లతో సమావేశమయ్యామని.. వారు తీసుకొచ్చిన ప్రతిపాదనలపై చర్చించామన్నారు. తరలింపు వదంతులను నమ్మొద్దని, ఈ ఏడాది బాటసింగారంలోనే మామిడి సీజన్ కొనసాగుతుందని కార్యదర్శి స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం నాటికి కోహెడలో మార్కెట్ సిద్ధమవుతుందని.. ఆ దిశగా ఇప్పటికే అధికారులు సన్నద్ధం చేస్తున్నారని తెలిపారు.

మార్కెట్​ యార్డుకు సంబంధించిన కమీషన్​ ఏజెంట్స్​ మార్కెట్​కు వచ్చి సమస్యను చెప్పారు. మార్కెట్​ సీజన్​కు సంబంధించి పలు సమస్యలు షెడ్డులు నిర్వహించాలని, యార్డుపై వచ్చిన తప్పుడు ప్రచారంపై ఏమైనా వివరణ ఇవ్వండి అని అడిగారు. మామిడి సీజన్​కు సంబంధించి బడ్జెట్​ కేటాయించాం. కావాల్సిన నిర్మాణాలు చేస్తాం. వస్తున్న వదంతలు నమ్మొద్దు. ఈ ఏడాది కూడా ఇక్కడే నిర్వహిస్తాం. -నరసింహారెడ్డి , మార్కెట్ కార్యదర్శి

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details