రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడలో మూడు రోజుల క్రితం ఓ బాలిక అదృశ్యమైంది. 13ఏళ్ల తన కూతురు పల్లవి కనిపించడం లేదంటూ అమె తండ్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పల్లవిని తమ ఇంటికి నీళ్లు పోయడానికి వచ్చే నర్సింహులు అనే యువకుడు కిడ్నాప్ చేశాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈరోజు రాత్రివరకు పల్లవి ఆచూకీ కనిపెడతామని బాలిక అమ్మానాన్నలకు పోలీసులు భరోసా ఇచ్చారు.
"మా కూతుర్ని ప్రాణాలతో అప్పగించండి" - girl missing
పాల ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పివెళ్లిన తమ కూతురు మూడ్రోజులైనా తిరిగిరాలేదు. ఇటీవలి కనిపించకుండా పోయిన అమ్మాయిలు శవమై తేలుతున్న ఘటనలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఆ తల్లిదండ్రులు. తమ కూతుర్ని ప్రాణాలతో అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు.
"మా కూతుర్ని ప్రాణాలతో అప్పగించండి"