దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఘనత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకే దక్కుతుందని రాజ్యసభ సభ్యులు కేశవరావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్టలో స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అనితరెడ్డి సమక్షంలో పీవీ నరసింహారావు విగ్రహం ఆవిష్కరించారు.
తోల్కట్టలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ - మొయినాబాద్‌లోని తోల్కట్టలో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు
రంగారెడ్డి జిల్లా తోల్కట్టలో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశవరావు, విద్యాశాఖ మంత్రి సబిత హాజరై పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు.

తోల్కట్టలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ
ఈ సందర్భంగా పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ అభివృద్ధి కోసం నరసింహారావు చేపట్టిన కార్యక్రమాలతోనే ఐఐటీ ఇతర రంగాలు అభివృద్ధి చెందాయని వారు అన్నారు. జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ ప్రపంచ దేశాల్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని తెలియజేశారు.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్