రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని వాలంతరీ సమీపంలో అటవీ శాఖాధికారులు పట్టుకున్న చిరుతను అమ్రాబాద్‌లోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈనెల 11న అటవీ శాఖాధికారులు వాలంతరీ పరిసర ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బందించారు. వెంటనే దాన్ని నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు తరలించి పశు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
వారం రోజుల తర్వాత చిరుత పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధరించుకున్న తర్వాత అమ్రాబాద్ అటవీ ప్రాంతానికి తరలించారు. జూపార్కు క్యూరేటర్ క్షితిజ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంత సంచాలకులు ఏకే.సిన్హా పర్యవేక్షణలో చిరుతను అటవీ ప్రాంతంలో వదిలారు.