తెలంగాణ

telangana

ETV Bharat / state

Warning : మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ

మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ
మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ

By

Published : Jul 19, 2021, 8:11 AM IST

Updated : Jul 19, 2021, 9:19 AM IST

08:09 July 19

నిండు కుండలా హిమాయత్‌సాగర్ జలాశయం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్​సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన ఈ జలాశయ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గేట్లు ఎత్తితే వరద నీరంతా మూసీలోకి చేరనుంది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

హిమాయత్​సాగర్​లోకి 1,666 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1762.60 అడుగులు ఉంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1784.60 అడుగులకు చేరింది. 

Last Updated : Jul 19, 2021, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details