హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపురి కూడలి వద్ద టాటా మోటర్ షోరూమ్‌లో ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొనుగోలుదారుడికి, బాలుడికి స్వల్పగాయాలయ్యాయి. టాటా మోటార్స్ కార్ షోరూమ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Car Accident: 'కారు కొందామని వస్తే... బోల్తా కొట్టింది' - Car accident at tata showroom
ఓ కస్టమర్ కారు కొందామని షోరూమ్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బంది కారును చూపించి అందుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కారును తీసుకోవాల్సిందిగా కస్టమర్‌కు యాజమాన్యం సూచించింది. అక్కడి వెళ్లి కారును స్టార్ట్ చేయగానే ఆగకుండా వెళ్లి కింద ఉన్న మరో కారుపై పడింది.

టాటా మోటర్ షోరూమ్
Car Accident: 'కారు కొందామని వస్తే... బోల్తా కొట్టింది'
కారు కొనడానికి వచ్చిన కస్టమర్‌కి షో రూమ్‌లోని మొదట అంతస్తులో ఉన్న కారును ఇచ్చింది. కస్టమర్ కారును స్టార్ట్ చేశాక నియంత్రణ కోల్పోయి మొదటి అంతస్తు లిఫ్ట్‌పై నుంచి కింద ఉన్న మరో కారుపై పడిపోయింది. కారులో ఉన్న కస్టమర్‌కు మరో బాబు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో అల్కాపురి కూడలిలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా... పోలీసులు క్రమబద్ధీకరించారు.
ఇదీ చూడండి:పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500!
Last Updated : Jul 21, 2021, 3:25 PM IST