రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో మైత్రి డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో చేపట్టిన నిర్మాణంలో ఫ్లాట్‌ను వి.సత్యవాణి దంపతులు రూ.36.62 లక్షలకు కొనుగోలు చేశారు. 2011 నాటికి ఫ్లాట్‌ను చెల్లించాల్సి ఉండగా... 2014లో అప్పగించి, 2015లో ఇంటీరియర్ పూర్తి చేశారు. ఫ్లాట్ కయ్యే మొత్తాన్ని ముందే చెల్లించినా... ఒప్పందం చేసుకున్న గడువులోగా ఫ్లాట్ అప్పగించనందున పిటిషనర్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇరు వాదనలు విన్న కమిషన్ 2012 నుంచి 2014 డిసెంబర్ వరకు నష్టపరిహారంగా రెండు లక్షల 29 వేల 600 రూపాయలు, పది వేలు ఖర్చుల కింద మొత్తం 2 లక్షల 39 వేల 600 రూపాయల ప్రతివాదులు చెల్లించాలని తీర్పునిచ్చింది.
'గడువు దాటినందుకు పరిహారం కట్టాల్సిందే' - hrc
ఒప్పందం ప్రకారం గడువులోగా ఫ్లాట్‌ను అప్పగించకపోవడం సేవా లోపమేనని, ఇందుకు పరిహారంగా 2 లక్షల 39 వేల 600 రూపాయలను నెలలోగా చెల్లించాలని మైత్రి డెవలపర్స్‌ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.
'ఆ పరిహారం మొత్తం రెండు లక్షల 39 వేల 600'