జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా శనివారం తన సొంత నియోజకవర్గం సనత్నగర్, అమీర్పేట్ డివిజన్లలో తలసాని పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం చేశారు.
వరద సాయంలో భాజపా నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తలసాని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వరద సాయం.. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంలో భాజపా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.