Covid positive to students: రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ కళాశాలలో 14 మందికి కొవిడ్ సోకగా.. మరో 17 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 31 కి చేరింది.
Covid in private college: ప్రైవేటు కళాశాలలో కొవిడ్ కలకలం.. కొత్తగా 17 కేసులు - నార్సింగి ప్రైవేట్ కళాశాలలో కరోనా కేసులు
15:38 December 29
ప్రైవేటు కళాశాలలో ఇప్పటివరకు 31 మంది విద్యార్థులకు కరోనా
రెసిడెన్షియల్ కళాశాలలో దాదాపు 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా... మంగళవారం 90 మంది విద్యార్థులకు ర్యాపిడ్ పరీక్షలు చేశారు. మిగిలిన వారికి ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో కొత్తగా 17 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ టెస్టులు చేయనున్నట్లు వైద్యారోగ్య సిబ్బంది వెల్లడించారు.
మరోవైపు ఒమిక్రాన్ కలవరం
Telangana omicron cases: మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. మంగళవారం మరో 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాగా... రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62 కి చేరుకుంది. ఈ 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోకపోవటం కొసమెరుపు. ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణైనట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు బయటి దేశాల నుంచి వచ్చినవాళ్లకే ఒమిక్రాన్ నిర్ధరణ కాగా.. ఇప్పుడు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనివారిలోనూ వేరియంట్ గుర్తించటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ఇదీ చదవండి:Governor Tamilisai on Vaccination: టీకా ఒక్క డోసు తీసుకోవడంతో ఉపయోగంలేదు : గవర్నర్ తమిళిసై