కేంద్రం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాలని.. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే దీక్షలు చేస్తున్నారు.
రైతులను దగా చేస్తున్న కేంద్రం: తెలంగాణ రైతు సంఘం - Inauguration of Telangana Farmers Association Relay in Ibrahimpatnam
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. అన్నదాతల ఉద్యమంపై మోదీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టింది.
రైతులను దగా చేస్తున్న కేంద్రం: తెలంగాణ రైతు సంఘం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో గత కొన్ని రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నా మోదీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో సంఘం నేతలు మధుసూదన్ రెడ్డి, సమేల్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి'