తెలంగాణ

telangana

ETV Bharat / state

INTER ADMISSIONS: ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల గడువు పొడిగింపు - ఇంటర్ మొదటి ఏడాది

telangana inter
తెలంగాణ ఇంటర్​

By

Published : Aug 30, 2021, 5:04 PM IST

Updated : Aug 30, 2021, 5:49 PM IST

17:02 August 30

ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల గడువు పొడిగింపు

రాష్ట్రంలో ఇంటర్మీడియట్​ మొదటి ఏడాది(INTER FIRST YEAR ADMISSIONS) ప్రవేశాల గడువు పొడిగిస్తూ ఇంటర్​ బోర్డు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 15 వరకు ఇంటర్​ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆ గడువు ఈ నెల 30 వరకు ఉండగా.. దాన్ని మరో 16 రోజుల పాటు పొడిగించింది.  

అంతే కాకుండా ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యార్థులు చేరుతున్నారు. ఇంటర్​ మొదటి ఏడాది ప్రవేశాల సంఖ్య లక్ష దాటింది. ఐదారేళ్లుగా ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకీ ప్రవేశాల సంఖ్య పెరుగుతుండటంతో సెప్టెంబరు 15వరకు ఇంటర్​ బోర్డు.. ప్రవేశాల గడువును పొడిగించింది.  

ఓ వైపు ప్రవేశాలు జరుగుతుండగా.. ఇంటర్​ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు కొనసాగుతున్నాయి. మరో వైపు మొదటి ఏడాదికి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ నెల 16నుంచి ఇంటర్​ విద్యాశాఖ ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించింది. ఈ నెలాఖరు వరకు దూరదర్శన్​లో తరగతుల షెడ్యూల్​ను విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అధికారులు పాఠాలు ప్రసారం చేస్తున్నారు.  

ఇదీ చదవండి:BANDI SANJAY: 'ఎంఐఎంతో తెరాసకు ఉన్న రహస్య ఒప్పందమేంటి?'

Last Updated : Aug 30, 2021, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details