Lands for Sale: ఆదాయ సమీకరణలో భాగంగా భూముల అమ్మకం మళ్లీ తెరపైకి వచ్చింది. తుర్కయాంజల్‌లో ఓఆర్ఆర్ లోపలవైపు ఉన్న ప్రభుత్వ ప్లాట్లు అమ్మనున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విటర్లో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాటన్లు ఈ వేలం పద్ధతిలో విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. తుర్కయంజాల్ లో మొత్తం 34 ప్లాట్లకు ఈ వేలం జరగనున్నట్టు వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రతిని ఆయన ట్విటర్లో పొందుపరిచారు. అందులో 600 నుంచి 700 గజాలు ఉన్నవి 14 ప్లాట్లు, 701 నుంచి 800 గజాలవి 10, 800 నుంచి 850 గజాలవి 5, 900 నుంచి 1060 గజాలవి 5 ప్లాట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
Lands for Sale: తుర్కయాంజల్ ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్న సర్కారు - telangana news
Lands for Sale: హైదరాబాద్‌లో భూముల అమ్మకం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుర్కయాంజల్‌లో ఓఆర్ఆర్ లోపలవైపు ఉన్న ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్నట్టు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాటన్లు ఈ-వేలం పద్ధతిలో అమ్ముతామని పేర్కొన్నారు.
ఈ నెల 31 నుంచి జూన్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని.... ప్రీ బిడ్డింగ్ మీటింగ్ జూన్ 4, 6 తేదీల్లో నిర్వహించనున్నట్టు వివరించారు. జూన్ 30వ తేదీన ఈ-వేలం ప్రక్రియ సాగుతుందని పేర్కొన్న అరవింద్ కుమార్... రిజిస్ట్రేషన్ కోసం 1000 రూపాయలను ఆన్లైన్లో చెల్లించాలని ప్రకటనలో పొందుపరిచారు. వ్యక్తులు, లేక సంస్థలు ప్లాట్ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని.. అందుబాటు ధరలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాట్లు లభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఇవీ చదవండి: