తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారు.. కానీ బదిలీల్లో చూడరేం.?' - జీవో 317 కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల ఆందోళన

Teachers protests at Rangareddy Collectorate: ఉపాధ్యాయ ఉద్యోగుల బదిలీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే స్థానికత కోసమని.. స్థానిక కోటాలో బదిలీలు చేయకుంటే రాష్ట్రం ఏర్పడింది ఎందుకుని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి​ స్టేషన్​కు తరలించారు.

Teachers protests at Rangareddy Collectorate
రంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన

By

Published : Jan 22, 2022, 12:50 PM IST

Teachers protests at Rangareddy Collectorate: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. బదిలీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్థానికత కోటాలో బదిలీలు చేయకుంటే రాష్ట్రం ఏర్పడింది ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారని.. కానీ బదిలీలు చేసేటప్పుడు ఆ అంశం పట్టించుకోరెందుకని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారీతిన పోస్టింగులు ఇవ్వడం దారుణమన్న ఉపాధ్యాయులు.... తమకు న్యాయం చేయాలని కోరారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

మానసిక వేదనకు గురవుతున్నాం

"317 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వెళ్లి ఎలా ఉద్యోగం చేయగలం.? స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలని సీఎం కేసీఆర్​ను వేడుకుంటున్నాం. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారు. కానీ ఇప్పుడెందుకు చూడటం లేదు.? మేం చదివింది, నివసిస్తుంది ఒక​ జిల్లాలో.. మరొక జిల్లాకు బదిలీ చేస్తే మేం స్థానికతను కోల్పోతాం. ప్రభుత్వ​ నిర్ణయంతో మేం మానసిక వేదనకు గురవతున్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి." --- బాధిత ఉపాధ్యాయులు

రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన

ఇదీ చదవండి:Telangana Employees Transfer : హైదరాబాద్​ వద్దు.. జిల్లాలే ముద్దంటున్న ఉద్యోగులు

ABOUT THE AUTHOR

...view details