తెలంగాణ

telangana

ETV Bharat / state

చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు.. తేదేపా శ్రేణుల ఆందోళన - అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలపై తేదేపా ఆందోళన

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై(chandrababu in ap assembly) వైకాపా ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను నందమూరి తారక రామారావు అభిమానులు ఖండించారు. వైకాపా అరాచక పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్​లోని వనస్థలిపురంలో అభిమానులు(tdp leaders dharna at vanastahlipuram) నిరసన ర్యాలీ నిర్వహించారు.

TDP dharna at vanasthalipuram
నందమూరి కుటుంబంపై ఏపీ అసెంబ్లీ వ్యాఖ్యలను నిరసిస్తూ తేదేపా శ్రేణుల ర్యాలీ

By

Published : Nov 22, 2021, 4:04 PM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుకు జరిగిన అవమానంపై నందమూరి ఫ్యాన్స్(chandrababu in assebmly) ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని వనస్థలిపురంలో(tdp leaders dharna at vanastahlipuram) వైకాపా నేతల వ్యాఖ్యలను నిరసనకు దిగారు. ఏపీ సీఎం జగన్​కు(ap cm jagan) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు, నందమూరి కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్​లో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. అనంతరం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలుగువారి ఆడపడుచులపై అసెంబ్లీ సాక్షిగా(chandrababu in assembly) వైకాపా నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అలాంటి వారిపై సీఎం జగన్ చర్యలు తీసుకోకుండా వారిని సమర్థించడం దారుణమన్నారు. వారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్లపై వైకాపా ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.అసెంబ్లీ సాక్షిగా వారి చంద్రబాబు, నందమూరి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలన్నారు.

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకు అవమానం

అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం అధినేతపై వైకాపా ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయన భార్య భువనేశ్వరి పేరును అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేలు ప్రస్తావించడంతో చంద్రబాబు ఆవేదనకు లోనయ్యారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కంటతడి పెట్టారు. ఆయనకు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని తేదేపా శ్రేణులు అందోళనకు దిగాయి. అసెంబ్లీ జరిగిన వ్యక్తిగత విమర్శలపై నందమూరి కుటుంబ సభ్యులు మొదటిసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. వైకాపా నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించేదని లేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరించారు.

ఇదీ చూడండి:

'మహిళలపై అలాంటి వ్యాఖ్యలు అత్యంత బాధాకరం'

ABOUT THE AUTHOR

...view details