కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రజలతో తరచూ సంబంధాలుండే సూపర్ స్పైడర్లకు మొదట వ్యాక్సిన్ (super spiders vaccination) ఇచ్చి వ్యాధి వ్యాప్తిని నివారించాలని… సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇవ్వనుందని ఎమ్మెల్యే(MLA) అంజయ్య యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిఆయన ప్రారంభించారు.
super spiders: టీకా ద్వారానే కరోనా కట్టడి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సూపర్ స్పైడర్ల వ్యాక్సినేషన్ (super spiders vaccination) కార్యక్రమాన్నిఎమ్మెల్యే(MLA) అంజయ్య యాదవ్ ప్రారంభించారు.
super spiders: టీకా ద్వారానే కరోనా కట్టడి
ప్రభుత్వం జారీ చేసిన జాబితాలో పలువురి పేర్లు లేకపోవడంతో అనేకమంది చాలాసేపు వ్యాక్సినేషన్ కేంద్రంలో వేచి ఉన్నారు. అధికారులు స్పందించక పోవడంతో పలువురు వెనుదిరిగారు. కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ కొందూటిరు నరేందర్, కౌన్సిలర్లు వెంకట్ రాం రెడ్డి, నాయకులు కిశోర్, ఎం.సాయి, శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Anandaiah: 'ఆనందయ్య మందుకు అనుమతివ్వాలి.. కార్పొరేట్‌కు లొంగొద్దు'