Students Suspended for Ragging in Hyderabad: ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించి ఎన్నో కొంగొత్త ఆశలతో పశువైద్య డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్ విద్యార్థులకు సీనియర్లు ర్యాగింగ్ పేరుతో నరకం చూపించారు. ఈ వేధింపులకు పాల్పడిన 34 మంది విద్యార్థులను తరగతులు, హాస్టళ్ల నుంచి పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం తాజాగా సస్పెండ్ చేసింది.
ర్యాగింగ్ పేరుతో సీనియర్ల టార్చర్.. 34 మంది విద్యార్థులు సస్పెండ్ - Students Suspended for Ragging in Hyderabad
Students Suspended for Ragging in Hyderabad: రాజేంద్రనగర్లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్ విద్యార్థులు చేసిన ఫిర్యాదుతో 34 మందిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Veterinary college
Hyderabad News Today : వీరిలో 25మందిని తరగతులు, మరో 9మందిని హాస్టళ్ల నుంచి, వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధించింది. దీనిపై ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ వేసి విచారణ జరిపారు. ర్యాగింగ్, హింసించిన తీరును బాధితులు వివరించడంతో బాధ్యులను రెండు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు సోమవారం వర్సిటీ ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి విచారణ జరిపిన తర్వాత తదుపరి చర్యలుంటాయని వివరించింది.
ఇవీ చదవండి: