తెలంగాణ

telangana

ETV Bharat / state

25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. జ్ఞాపకాలు పంచుకున్నారు - students

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ పాఠశాల 1993-94 బ్యాచ్​ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సిల్వర్​ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. జ్ఞాపకాలు పంచుకున్నారు

By

Published : Nov 19, 2019, 5:26 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ పాఠశాల పూర్వవిదార్థుల సమ్మేళనం(1993-94) సిల్వర్ జూబ్లీ వేడుకలు చేవెళ్లలోని శ్రీవెంకటేశ్వర గార్డెన్ లో ఘనంగా జరిగాయి. సుమారు 100 మంది పూర్వ విద్యార్థులంతా కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకే చోట అందరూ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తమ స్నేహితుడి కుటుంబానికి తోటి స్నేహితులు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. స్నేహితులంతా ఎవరికి కష్టం వచ్చినా... ఆపదలో ఉన్నా చేయూతనివ్వాలని అన్నారు..ఈ కార్యక్రమంలో తమకు విద్యాబోధనలు నేర్పించిన చిన్న నాటి గురువు విశ్వనాథ్ గుప్తాను ఘనంగా సన్మానించారు.

25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. జ్ఞాపకాలు పంచుకున్నారు

ABOUT THE AUTHOR

...view details