లాక్ డౌన్ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. అకారణంగా రోడ్లపైకి వస్తున్న వారిని కట్టడి చేస్తున్నారు. అత్యవసరమైన పనుల ఉంటే తప్ప బయటకు రాకూడదని ఉన్నతాధికారులు సూచనలు చేసినా కొందరు పాటించట్లేదు. అటువంటి వారిపై కొరడా ఝళిపిస్తున్నారు.
33 చెక్ పోస్టులు...43,339 కేసులు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 33 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘనలపై 43,339 కేసులు నమోదు అయ్యాయి. 2439 వాహనాలు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి : ప్రపంచవ్యాప్తంగా 15లక్షలు దాటిన కరోనా కేసులు