తెలంగాణ

telangana

ETV Bharat / state

బలవంతపు భూసేకరణ ఆపండి: కోదండరాం - ఫార్మా భూనిర్వాసితులకు అండగా కోదండరాం

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో ప్రొఫెసర్ కోదండరాం... రైతుల సమస్యలను అడిగి తెలుకున్నారు. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు.

బలవంతపు భూసేకరణ ఆపండి: కోదండరాం
బలవంతపు భూసేకరణ ఆపండి: కోదండరాం

By

Published : Oct 23, 2020, 4:45 PM IST

ఫార్మా కంపెనీల కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ ఆపాలని ఆచార్య కోదండరాం... ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మా భూనిర్వాసితులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో రైతుల సమస్యలను అడిగి తెలుకున్నారు. ప్రజల అభీష్టం మేరకు గ్రామసభలు నిర్వహించి భూములు తీసుకోవాలి తప్ప... ఇష్టానుసారంగా రేటు నిర్ణయించి ఫార్మా కంపెనీలు పెట్టడం సరికాదన్నారు.

ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న రైతులు, నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని మండిపడ్డారు. భూసేకరణ చట్టం ప్రకారం భూములను తీసుకోవడం లేదన్నారు. విషపూరిత ఫార్మా కంపెనీల పేరుతో పచ్చని పంట పొలాల్లో చిచ్చు పెడుతున్నారన్నారు. ఫార్మాసిటీకి వ్యతిరేకంగా తెజస అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వినయ్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన

ABOUT THE AUTHOR

...view details