తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2021, 4:37 PM IST

ETV Bharat / state

పెన్షన్ పెంపుపై రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ హర్షం

పెన్షన్ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం చేశారు. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ప్రకటించడంపై హైదరాబాద్​లోని చైతన్యపురిలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

State Pensioners Association
రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్

అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 15 శాతం ప్రకటించడంపై పట్ల రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం జీవో విడుదల చేయనుందని వారు తెలిపారు. హైదరాబాద్​లోని చైతన్యపురిలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పెన్షనర్ల వయసును 75 నుంచి 70 ఏళ్లకు తగ్గించడం అభినందనీయమని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే పెన్షనర్ల కోసం ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్​ను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పెన్షనర్స్ జేఏసీ ఛైర్మన్ లక్ష్మయ్య తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటామన్నారు.

ఇదీ చూడండి:ఉచిత నేత్ర వైద్య శిబిరాన్నిప్రారంభించిన మంత్రి తలసాని

ABOUT THE AUTHOR

...view details