రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఛైర్మన్ లక్ష్మయ్య అన్నారు. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లోని వనస్థలిపురంలో పీఆర్సీ ప్రకటన ఉత్తర్వులను దహనం చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వెనక్కి తీసుకోవాలి' - వనస్థలిపురంలో పెన్షనర్ల ఆందోళన
రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో కొత్త పీఆర్సీ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు.
!['రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వెనక్కి తీసుకోవాలి' State government should take back PRC immediately demand by telangana pensioners jac](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10402387-401-10402387-1611758375397.jpg)
'రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వెనక్కి తీసుకోవాలి'
పీఆర్సీపై సీఎం ముగ్గురు అధికారులను నియమించినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వం నుంచి 63 శాతం ఫిట్‌మెంట్ వస్తుందని ఆశించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పట్ల పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం అంటూనే పెన్షనర్ల సదుపాయాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.