తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగునీటిలో బల్లి.. విద్యార్థుల ఆందోళన - sri chaitanya students slogans against management

రంగారెడ్డి జిల్లా అంబర్​పేట్​ డీడీకాలనీలోని శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థులు తాగే నీటిలో బల్లిపడింది. కొంతవిద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. యాజమాన్య తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాగునీటిలో బల్లి.. విద్యార్థుల ఆందోళన

By

Published : Nov 8, 2019, 10:07 AM IST

రంగారెడ్డి జిల్లా అంబర్​పేట్​ పరిధిలోని డీడీకాలనీలోని శ్రీచైతన్య కళాశాలలో తాగునీటిలో బల్లిపడింది. ఆనీరు తాగడం వల్ల కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళన చేపట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చచెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.

తాగునీటిలో బల్లి.. విద్యార్థుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details