తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డుపై ఉమ్మి వేసినందుకు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్​ - ఉమ్మి వేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం చెక్​పోస్ట్ వద్ద రోడ్డుపై నిర్లక్ష్యంగా ఉమ్మి వేసిన ఇద్దరు వ్యక్తులపై రంగారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

spit on road two people are arrested in rangareddy
రోడ్డుపై ఉమ్మి వేస్తే శిక్ష.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్​

By

Published : Apr 13, 2020, 3:36 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. కాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ పోలీస్​స్టేషన్​ పరిధిలోనే ఇద్దరు వాహనదారులు నిర్లక్ష్యంగా రోడ్డుపైనే ఉమ్మి వేస్తూ పోలీసులుకు అడ్డంగా దొరికిపోయారు.

కొత్తగూడెం చెక్​పోస్ట్​ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంకు చెందిన ఎస్​కే. హాజీ పాషా, మీర్ జహంగీర్ బాధ్యతారాహిత్యంగా రోడ్డుపై ఉమ్మి వేశారు. ఇది గమనించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details