కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్లో ఆకలితో అలమటించిన మనుషుల ఆకలి తీర్చేందుకు సాటి మనిషి ముందుకొచ్చాడు. మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. కానీ మూగజీవాల పరిస్థితేంటి? వాటి ఆకలి కేకలు అరణ్యరోదనగా మిగిలాయి. ఎవరో కొద్దిమంది మాత్రమే వాటివంక చూసి తిండిపెట్టి ప్రాణం పోశారు.
డొక్కలెండి... మౌనంగా రోదిస్తున్న గోమాత - శంకర్పల్లిలో ఆకలి అలమటిస్తున్న గోవులు
అటువైపు వెళ్తే గోమాత ఆశగా చూస్తోంది. వారి ఆకలి బాధ తీర్చడానికి ఏమైనా... తెస్తారేమోనని. డొక్కలెండిపోతున్న కడుపు నింపుతారేమోనని... దీనమైన కళ్లతో ఎదురుచూస్తోంది. వాటికే గనక మాట్లాడే శక్తుంటే... ప్రపంచమంతా వినపడేలా చెప్పుకునేవేమో. సాటి మనిషి ఆకలి బాధ తీర్చడానికి మరో మనిషి ఉన్నాడు. కానీ మూగ జీవాల ఆకలి కేకలు తీర్చడానికి ఎవరున్నారు? వాటి కడుపు నింపడానికి మంచిమనసున్న దాత కోసం ఎదురుచూస్తోన్న మూగజీవాలపై ప్రత్యేక కథనం.
మౌనంగా రోదిస్తున్న గోమాత
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో ఉన్న ఓ గోశాలలో మాత్రం వందలాది గోమాతలు ఆకలితో అల్లాడుతున్నాయి. పశుగ్రాసం దొరకక డొక్కలెండిపోయి... మౌనంగా రోదిస్తున్నాయి. దాతలెవరైనా తమపై దయచూపి పచ్చిగడ్డో, ఎండుగడ్డో తెస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాయి. వేళకు తిండి దొరకకపోవడం వల్ల నీరుతాగి ఆకలిబాధను తీర్చుకుంటున్నాయి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి