రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలజీ ఆలయంలో కరోనా వైరస్ రాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్, అర్చకులు సౌందర్యరాజన్ ఈ కార్యక్రమం నిర్వహించారు.
చిలుకూరు బాలాజీ ఆలయంలో 'కరోనా' పూజలు - చిలుకూరులో కరోనా వైరస్ ప్రత్యేక పూజలు
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో కరోనా సోకకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయంలో 'కరోనా' పూజలు
సమాజంలో ఏ రుగ్మత వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చిన తొలుత స్పందించేది స్వామివారేనని పండితులు తెలిపారు. స్వామివారి ఆశీర్వాదంతో కరోనాపై పోరాడుతామన్నారు. వైరస్ సోకకుండా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థాన్ని భక్తులందరిపై చల్లారు. సుమారు 2000 మంది పూజల్లో పాల్గొన్నారని అర్చకులు తెలిపారు.