ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీని దక్షిణ కొరియా ప్రతినిధి బృందం సందర్శించింది. భారత్‌లోని ఆ దేశ రాయబారి చాంగ్ జే బోక్ నేతృత్వంలోని బృంద సభ్యులు రామోజీఫిల్మ్‌సిటీలో పర్యటించారు. ఫిల్మ్ సిటీలో షూటింగ్ సెట్లు, లొకేషన్స్, పలు స్టూడియోలతో సహా అనేక ఫిల్మ్ మేకింగ్ సౌకర్యాలను పరిశీలించారు.
ఫిల్మ్ సిటీలోని సౌకర్యాలు, విభాగాలు, రంగస్థల నిర్మాణాలను దక్షిణ కొరియా ప్రతినిధి బృందం వీక్షించింది. చాంగ్ జే బోక్‌తో పాటు ప్రతినిధులంతా మాయ సెట్‌ను సందర్శించారు. అక్కడ అంతర్గత సెట్ డిజైన్, నిర్మాణ సదుపాయం, డిజైన్‌ను రూపొందించడంలో ఉన్న నైపుణ్యాన్ని ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. చాంగ్ జే బోక్ బృందానికి రామోజీరావు జ్ఞాపిక బహుకరించారు. ఈ కార్యక్రమంలో గు జంగ్ హ్యూన్, ఆర్ఎఫ్సీ ఎండీ విజయేశ్వరి, మేనేజింగ్ డైరెక్టర్, రామోజీ ఫిల్మ్ సిటీ డైరెక్టర్ సీహెచ్ సోహనా హాజరయ్యారు.