Sirpurkar Commission:రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ చేస్తున్న సిర్పూర్కర్ కమిషన్... ఆ ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్, దిశ మృతదేహం దహనం చేసిన స్థలాలను బృందం సభ్యులు పరిశీలించారు. భారీ భద్రత మధ్య కమిషన్ సభ్యులు పర్యటించారు. దాదాపు ఒక గంటపాటు ఘటన జరిగిన ప్రాంతంలో ఉండి ఆరా తీశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పీఎస్‌లో మరిన్ని వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అయితే కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పీఎస్ ఎదుట వివిధ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.
పీఎస్ ఎదుట ప్రజాసంఘాల ఆందోళన
shadnagar ps: కమిషన్ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమాచారం అందుకున్న ప్రజా, యువజన సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పీఎస్ వద్దకు చేరుకుని కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే కమిషన్‌ను రద్దు చేయాలని పీఎస్ ఎదుట బైఠాయించారు. కమిషన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో షాద్ నగర్ పోలీసులు ఆందోళనకారులను నిలువరించారు.