తెలంగాణ

telangana

ETV Bharat / state

దుకాణంలో విద్యుదాఘాతం... ఆస్తినష్టం - RANGAREDDY DISTRICT GROCERY STORE SHORT CIRCUIT

రంగారెడ్డి జిల్లా శంకర్​ పల్లి మండలం ప్రొద్దుటూరులోని ఓ కిరాణా షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది.

షార్ట్ సర్క్యూట్​తో 8 లక్షల ఆస్తి నష్టం... తప్పిన ప్రాణ నష్టం
షార్ట్ సర్క్యూట్​తో 8 లక్షల ఆస్తి నష్టం... తప్పిన ప్రాణ నష్టం

By

Published : Dec 1, 2019, 10:55 PM IST

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం ప్రొద్దుటూర్ గ్రామంలోని ఏనుగు చెన్నారెడ్డి ఇంట్లోని కిరాణా షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందరూ చేవెళ్లలో పెళ్లికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. నివాసంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 8 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.శంకర్​పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు.

షార్ట్ సర్క్యూట్​తో 8 లక్షల ఆస్తి నష్టం... తప్పిన ప్రాణ నష్టం
ఇవీ చూడండి : నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​

ABOUT THE AUTHOR

...view details