తెలంగాణ

telangana

ETV Bharat / state

గొర్రెల అపరహణకు పాల్పడుతున్న ముఠా - Sheeps abduction in Mudimyal village chevella rangareddy district

రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గొర్రెల మంద నుంచి గొర్ల చోరీకి పాల్పడుతున్నారు. మంద యజమాని వెంబడించగా కారును వదిలి దొంగలు పరారయ్యారు.

Sheeps abduction in Mudimyal village chevella rangareddy district
గొర్రెల అపరహణకు పాల్పడుతున్న ముఠా

By

Published : Aug 23, 2020, 3:30 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన గౌడిచెర్ల రవికి గొర్రెల మంద ఉంది. రాత్రి 2 గంటల సమయంలో కారులో రవి పొలానికి వెళ్లాడు. మందలోంచి గొర్రెల అపహరణకు పాల్పడుతున్న దొంగలు అతని కారు లైట్లను చూసి ఇన్నోవా కారులో రావులపల్లి వైపు వెళ్లారు. రవి వారిని వెంబడించగా కారును అక్కడే వదిలేసి పరారయ్యారు.

ఈ నెల17వ తేదీనుంచి సుమారు 20 గొర్రెలను చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు.. కారును స్టేషన్​కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.

వదిలేసిన కారు

ఇవీ చూడండి: గవర్నర్​కు రేవంత్ లేఖ.. 'శ్రీశైలం విషయంలో జోక్యం చేసుకోండి'

ABOUT THE AUTHOR

...view details