రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి పురపాలికలో తెరాస సాధించింది. శంకర్‌పల్లి పురపాలికలో ఛైర్మన్ స్థానాన్ని తెరాస గెలుపొందింది.
శంకర్‌పల్లి పురపాలికలో కారు జోరు - శంకర్‌పల్లి పురపాలిక ఎన్నికల ఫలితాలు
తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస దూసుకెళ్తోంది. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి పురపాలికలో గులాబీ జెండా రెపరెపలాడింది.

శంకర్‌పల్లి పురపాలికలో కారు జోరు
శంకర్‌పల్లిలోని 15 వార్డుల్లో 10 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసింది. 3 వార్డుల్లో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. శంకర్‌పల్లి పురపాలిక పరిధిలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.