తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే కష్టాలు తప్పవు' - మున్సిపల్​ ఎన్నికలు

ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే ఊరుకోబోమని శంషాబాద్​ మున్సిపల్​ కమిషనర్​ చాముండేశ్వరి అభ్యర్థులను హెచ్చరించారు. ప్రచారం కోసం లక్ష రూపాయల కంటే అధికంగా ఖర్చు చేస్తే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని చెప్పారు.

shamshabad muncipal commissioner meet candidates of muncipal elections
'నిబంధనలు అతిక్రమిస్తే కష్టాలు తప్పవు'

By

Published : Jan 15, 2020, 4:46 PM IST

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కష్టాలు తప్పవని శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి హెచ్చరించారు. శంషాబాద్​లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులతో, అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రతి అభ్యర్థికి క్లుప్తంగా ఎన్నికల నిబంధనల గురించి వివరించామని ఆమె తెలిపారు.

శంషాబాద్ మొత్తంలో 25 వార్డులకుగానూ 102 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. ప్రతి అభ్యర్థి లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదని చెప్పారు. అధికంగా ఖర్చు చేస్తే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని చాముండేశ్వరి పేర్కొన్నారు.

'నిబంధనలు అతిక్రమిస్తే కష్టాలు తప్పవు'

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: కొల్లాపూర్​లో నేతల మధ్యే కొట్లాట... మరి గెలిచేదెవరో...?

ABOUT THE AUTHOR

...view details