తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ సమస్యను తీరిస్తేనే ఓటేస్తాం.. - SHAD NAGAR PEOPLE PROBLEMS FOR DRINAGE SYSTEM

మురుగు కాలువల నిర్మాణం సరిగ్గా లేక పట్టణంలోని మురుగు నీరంతా శివారు కాలనీల్లోకి వస్తోంది. విపరీతంగా దోమలు పెరిగి నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను తీర్చిన వారికే తాము ఓటు వేస్తామంటున్నారు.

drinage problems
ఆ సమస్యను తీరిస్తేనే ఓటేస్తాం..

By

Published : Jan 4, 2020, 4:59 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ పురపాలికలు దుర్గంధ వాసనతో అల్లాడిపోతున్నాయి. శివారు కాలనీల మురుగు కాలువలు అస్తవ్యస్తంగా ఉండంటం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడం వల్ల పట్టణంలోని వివిధ కాలనీల నుంచి మురుగు నీరంతా శివారు కాలనీల్లోకి వస్తోంది. దోమలు విపరీతంగా పెరిగి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను నివారించే వారికే తాము ఓటు వేస్తామని చెప్తున్నారు.

ఆ సమస్యను తీరిస్తేనే ఓటేస్తాం..

ABOUT THE AUTHOR

...view details