రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లారీల పార్కింగ్‌లో అక్రమ దందా బయటపడింది. లారీల నుంచి ఆటోలోకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.
పదివేల కిలోల రేషన్ బియ్యం పట్టివేత - రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి తాజా వార్తలు
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో పీడీఎస్ బియ్యం అక్రమ దందా కొనసాగుతుంది. గుట్టుచప్పుడు కాకుండా లారీల నుంచి ఆటోలోకి తరలిస్తున్న రైస్‌ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 10 వేల కిలోల బియ్యం, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
10 వేల కిలోల అక్రమ బియ్యం పట్టివేత
10 వేల కిలోల పీడీఎస్ బియ్యం, మూడు ఆటోలు, ఒక లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైమద్‌ని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాత్రి సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :తెలంగాణలో మరో 2,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు