తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సు ఎక్కే క్రమంలో కింద పడిపోయి రెండు కాళ్లు కోల్పోయిన పాఠశాల విద్యార్థి - ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన పాఠశాల విద్యార్థి

School Student lost his Legs in Accident : బస్సు ఎక్కే ప్రయత్నంలో ఓ పాఠశాల విద్యార్థి తన రెండు కాళ్లు పోగొట్టుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ విద్యార్థి రెండు కాళ్లపై నుంచి ప్రమాదవశాత్తు బస్సు వెళ్లింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడటంతో స్థానికులు షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మరో ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు.

School Student lost his Legs in Accident
Bus Accident In Rangareddy

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 10:49 PM IST

School Student lost his Legs in Accident :రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం రాయికల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ప్రమాదానికి గురై తన రెండు కాళ్లు కోల్పోయాడు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం ప్రకారం. మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగాధర్​పల్లి గ్రామపంచాయతీ కుంటలోపు తండాకు చెందిన నీల, తావుర్యా దంపతుల కుమారుడు అశోక్ (8) రాయికల్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. పాఠశాల విడిచిన తర్వాత సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి రాయికల్ గ్రామ శివారులో రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్నాడు.

షాదనగర్ నుంచి సూరారం వెళ్లే బస్సు రాగానే విద్యార్థులు ఆ వెహికల్​ వెంట పరిగెత్తారు. బస్సు ఎక్కే ప్రయత్నంలో అశోక్ ఆ వాహనం వెనుక టైర్ల కింద పడగా బస్సు రెండు కాళ్లపై నుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విద్యార్థిని కుటుంబ సభ్యులు శంషాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details