రాష్ట్ర గురుకులాల కార్యదర్శి డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌పై భారతీయ జనతా పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్వైరోస్, ఎస్సీ సంఘాల నేతలు ఆరోపించారు. భాజపా నాయకులు ఆయనకు క్షమాపణ చెప్పాలని కోరుతూ.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
'ప్రవీణ్ కమార్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి' - ప్రవీణ్ కుమార్‌పై అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎస్సీ సంఘాల ఆందోళన
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌పై భాజపా నేతలు అసత్య ఆరోపణలు చేయడం తగదని స్వైరోస్, ఎస్సీ సంఘాల నేతలు అన్నారు. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్న ఆయనపై ఆసత్య ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు.
'ప్రవీణ్ కమార్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి'
గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరుస్తున్న ప్రవీణ్ కుమార్‌పై ఆర్ఎస్ఎస్, భాజపాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను మానుకోవాలని ఎస్సీ సంఘాల నేతలు అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కమలం పార్టీ నాయకులు ప్రవీణ్ కమార్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:సీల్ లేని బ్యాలెట్ బాక్సులు తెచ్చారని ఏజెంట్ల ఆందోళన