తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్పంచ్​ల సమస్యలపై ఛలో అసెంబ్లీ'

ఉమ్మడి చెక్​పవర్​, గ్రామ పంచాయతీలకు నిధులు, గౌరవ వేతనం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని రాష్ట్ర సర్పంచ్​ల సంఘం హెచ్చరించింది.

'సర్పంచ్​ల సమస్యలపై ఛలో అసెంబ్లీ'

By

Published : Sep 5, 2019, 5:17 PM IST

హైదరాబాద్​ నారాయణగూడలో.. రంగారెడ్డి జిల్లా సర్పంచ్​ల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీకి రాష్ట్ర సర్పంచ్​ల సంఘం గౌరవాధ్యక్షుడు సౌదని భూమన్న యాదవ్​ హాజరయ్యారు. సర్పంచ్​, ఉపసర్పంచ్​ల ఉమ్మడి చెక్​పవర్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ వైఖరితో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఏకగ్రీవమైన సర్పంచ్​లకు ప్రకటించిన నజరానాను వెంటనే విడుదల చేయాలన్నారు. సర్పంచ్​ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి 20 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లపై ప్రభుత్వ సానుకూలంగా స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

'సర్పంచ్​ల సమస్యలపై ఛలో అసెంబ్లీ'

ABOUT THE AUTHOR

...view details