రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద చెరువు కట్టపైనున్న పాపన్న గౌడ్ విగ్రహానికి భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వివిధ పార్టీల నేతలు, గౌడ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు - సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 370 వ జయంతి వేడుకలు
సర్ధార్ సర్వాయి పాపనన గౌడ్ 370 వ జయంతిని... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా భవనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు.
![ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు sardhar sarvai papanna goud birth anniversary celebrations in ibhrahimpatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8462513-640-8462513-1597741236467.jpg)
ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
దళిత బహుజనులు ఏకమై ఉద్యమిస్తే... రాజ్యాధికారం సాధించవచ్చునని భారతదేశ చరిత్రలో 17వ శతాబ్ధంలోనే నిరూపించిన గొప్ప నాయకుడు పాపన్న గౌడ్ అని నర్సయ్య గౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అశోక్ గౌడ్, నాయకులు రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.