ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం సగర జాతికి ఇచ్చిన స్థలాన్ని మార్చరాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ డిమాండ్ చేశారు. కులాలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను కొందరు అధికారులు కుట్ర చేసి మార్పిడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
రిజర్వేషన్ కల్పించాలి..
కోర్టు ఆదేశాలు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే మొదట కేటాయించిన ప్లాట్ వద్ద సగర ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. సంఘాన్ని పటిష్ఠం చేయడానికి గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని తీర్మానించారు. నిర్మాణ రంగమే కుల వృత్తిగా కొనసాగిస్తున్న సగరులకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్ కల్పించాలని సర్కారును కోరారు.