రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో శుక్రవారం రాత్రి సదరు ఉత్సవాలు(Sadar celebrations 2021) ఘనంగా జరిగాయి. హయత్నగర్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఉత్సవాల్లో దున్నపోతుల విన్యాసాలు చూడటానికి ప్రజలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, వాయిద్యాలతో దున్నలను ఆడిస్తూ కోలాహలంగా వేడుక చేసుకున్నారు. చిన్నాపెద్ద సందడి చేస్తూ దున్నపోతులను ఊరేగించారు.
దీపావళి రోజున పాడిపశువులను మొదటగా పూజించి సంబురాలు చేసుకుంటాం. ఐదేళ్లుగా యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. యాదవులంతా ఐకమత్యంగా ఉండాలని, పాడి పశువులు, సిరిసంపదలతో సంతోషంగా ఉండాలని వేడుకలు నిర్వహిస్తాం. -బాలకృష్ణ, సదర్ నిర్వాహక సభ్యులు