తెలంగాణలో కాంగ్రెస్ ఆరు ఎంపీ స్థానాలు గెలుస్తుందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు మేలవుతుందని... రాష్ట్ర ప్రజలు గ్రహించారని... రానున్న ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఉన్న అభ్యర్థులనే బరిలోకి దింపిందని సచిన్ పైలెట్ పేర్కొన్నారు.
'సత్తా ఉన్న అభ్యర్థులనే కాంగ్రెస్ బరిలోకి దింపింది' - mp candidate
తెరాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఆరు ఎంపీ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
!['సత్తా ఉన్న అభ్యర్థులనే కాంగ్రెస్ బరిలోకి దింపింది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2936058-thumbnail-3x2-sachin.jpg)
కొండా విశ్వాశ్వర్ రెడ్డికి మద్ధతుగా సచిన్ పైలట్
కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్ధతుగా సచిన్ పైలట్
ఇవీ చూడండి: "మోదీ, కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ"