తెలంగాణ

telangana

ETV Bharat / state

తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ - chevella

కాంగ్రెస్​ పార్టీ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తెరాస నేత తీగల కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మరికొన్ని రోజుల్లోనే సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. బుధవారం సీఎం కేసీఆర్​తో భేటీ సత్ఫలితాలను ఇచ్చినట్లు సమాచారం.

తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ

By

Published : Mar 14, 2019, 1:03 PM IST

తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ
గులాబీ పార్టీలో చేరనున్న మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తెరాస నేత తీగల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు తనయుడు కార్తీక్ రెడ్డి, ఇతర కాంగ్రెస్​ పార్టీ నాయకులు వెంట వెళ్లారు. తెరాసలో చేరిక, రాబోయే రోజుల్లో ఇరు వర్గాల క్యాడర్​ ఎలా కలిసి ముందుకు సాగాలన్నదానిపై చర్చించారు.

బుధవారం మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో కలిసి ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​తో భేటీ అయిన విషయం తెలిసిందే. చేవెళ్ల నుంచి కార్తీక్​ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్​ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details