ఆర్టీసీ సమ్మె కార్మికుల కుటుంబాల్లోనే కాదు సామాన్యులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. రాకపోకలతోపాటు నిత్యావసర సరుకుల ధరలపైనా సమ్మె ప్రభావం కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఒకవైపు, సమ్మెతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడగా... రైతు బజార్లలో కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు.
సమ్మె ఎఫెక్ట్: కూరగాయలపై పెరుగుతున్న భారం - Rtc_Strike_Effect_on -Raithubazar
ఆర్టీసీ కార్మికుల సమ్మె... నిరసనలు, ఆందోళనలతో హోరెత్తుతోంది. సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. రాకపోకలతోపాటు నిత్యావసర సరుకుల ధరలపైనా సమ్మె ప్రభావం కనిపిస్తోంది.

సమ్మె ఎఫెక్ట్: కూరగాయలపై పెరుగుతున్న భారం
ఒక్కో కూరగాయపై గరిష్ఠంగా రూ.20 పెరగడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. వారానికి రూ.200 అయ్యే ఖర్చు రూ.500 దాటుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఐకాస నాయుకులు చెరో మెట్టు దిగి సాధ్యమైనంత త్వరగా సమ్మెను విరమించాలని వేడుకుంటున్నారు.
సమ్మె ఎఫెక్ట్: కూరగాయలపై పెరుగుతున్న భారం
ఇదీ చదవండిః ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు
Last Updated : Nov 8, 2019, 7:58 AM IST