వచ్చే 45 రోజుల్లో ప్రతి ఓటరు తమ ఓటును జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ సూచించారు. 2020 ఓటరు జాబితా మదింపు ప్రక్రియలో భాగంగా కొత్త జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 15 నాటికి ఆ జాబితాను ప్రచురించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, రాజకీయ పార్టీలతో ఓటరు జాబితాపై కలెక్టర్ లోకేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా లేదా కొత్తగా నమోదు చేసుకోవాలన్న వారంతా ఫారం 6, 7, 8ఏ ద్వారా నమోదు చేసుకోవాలని వివరించారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ జరపనున్నట్లు లోకేశ్ కుమార్ వెల్లడించారు.
45 రోజుల్లో మీఓటు ఉందో.. లేదో..? చూసుకోండి.. - రంగారెడ్డి జిల్లా
రాష్ట్రంలో వచ్చే 45 రోజుల్లో ప్రతి ఓటరు తమ ఓటు.. ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ సూచించారు. 2020 ఓటరు జాబితా మదింపు ప్రక్రియలో భాగంగా కొత్త జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
వచ్చే 45 రోజుల్లో మీఓటు ఉందో పరిశీలించుకోవాలి