తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి - rallagadda outer ring road accident

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలం రాళ్లగూడ ఔటర్ ​రింగ్​రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

road accident at rallagadda outer ring road in rangareddy district
రాళ్లగూడ ఓఆర్​ఆర్ వద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

By

Published : Feb 1, 2020, 9:02 AM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలం రాళ్లగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్​ వెళ్తుండగా రాళ్లగూడ ఔటర్​రింగ్​రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న బాల్​రెడ్డి, నర్సింహలు అక్కడికక్కడే మృతి చెందారు. శంకర్​ అనే మరో వ్యక్తి తీవ్రగాయాలపాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details