రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటాఏస్ వాహనం ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ చేసిన ప్రాంతాన్ని చూసుకుంటూ డ్రైవర్ వాహనం నడపడం ప్రమాదానికి కారణమైంది. క్షతగాత్రులను వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చూడటానికి వచ్చినవారు వాహనాలను వంతెనపై నిలిపేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విధంగా మూడు రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరిగాయి.
చటాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ఆరుగురికి తీవ్రగాయాలు - చటాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఆరుగురికి గాయాలు
దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ప్రదేశం.. చటాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటాఏస్ వాహనం ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
చటాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఆరుగురికి గాయాలు