తెలంగాణ

telangana

ETV Bharat / state

పేలుడు శబ్దానికే కర్ణభేరి పగిలిపోయే.. - osmania

బాయిలర్​ పేలిన కేసు దర్యాప్తు కోసమని వెళ్లిన అధికారులకు మళ్లీ అదే పరిశ్రమలో పేలుడు  సంభవించి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.  పేలుడు ధాటికి ఎస్​ఐ నదీమెుద్దీన్​, కార్పొరేటర్​ మిస్భాలకు చెవిలో ఉండే కర్ణభేరి పగిలిపోయిందని వైద్యులు వెల్లడించారు.

రసాయన పరిశ్రమలో ప్రమాదం

By

Published : Apr 11, 2019, 5:12 AM IST

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవిపల్లి ప్రాంతంలోని శాస్త్రిపురంలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో పేలుడు జరిగింది. ఈ సంఘటనలో పోలీసు ఇన్​స్పెక్టర్ సత్తయ్యతోపాటు స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మిస్భా‌, మాజీ కార్పొరేటర్ మీర్జా రహ్మత్‌ బేగ్‌లతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. పేలుడు సందర్భంగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఎస్‌ఐ నదీమెుద్దీన్‌, కార్పొరేటర్ మిస్భాలకు చెవిలోఉండే కర్ణబేరి పగిలిపోయిందని వైద్యులు నిర్ధరించారు. వీరందరిని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.

దర్యాప్తు కోసం వెళ్లగా ఘటన

రెండు రోజుల క్రితం ఇదే పరిశ్రమలో రసాయన బాయిలర్ పేలటం వల్ల అఫ్రోజ్ అనే కార్మికుడికి కాలు తెగిపోయింది. అతన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రి నుంచి మైలార్​దేవిపల్లి పోలీసులకు సమాచారం వచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ సత్తయ్య, ఎస్‌ఐ నదీమొద్దీన్ స్థానిక నాయకులతో కలిసి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌ చక్రవర్తి, శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు.

రసాయన పరిశ్రమలో ప్రమాదం

ఇవీ చూడండి: 'ఉపాధి' పనికి పోతే... ప్రాణాలు పోయాయి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details