ఇటీవల కురిసిన వర్షాలకు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు హఠాత్తుగా కుంగిపోయింది. ఈ వర్షాలకు పది అడుగుల మేర గుంతగా మారింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారి నుంచి ప్రశాంత్‌నగర్ వైపు వెళ్లే రోడ్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని... అటు వైపుగా వచ్చే వాహనాలను దూరంగా మళ్లించారు. ఆ పరిసర ప్రాంతాల్లో పైపులైన్లు కూడా ఏమీ లేవని జలమండలి అధికారులు తెలిపారు. అధికారులు శుక్రవారం పరిశీలించి... గుంతలో చేరిన నీటిని తొలగించి మరమ్మతు పనులు చేపట్టారు.
గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు - మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు మరమ్మతు పనులు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు... ఇటీవల కురిసిన వర్షాలకు హఠాత్తుగా కుంగిపోయింది. పది అడుగుల మేర గుంతగా మారింది. ప్రశాంత్‌నగర్ వైపు వెళ్లే రోడ్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం నాడు అధికారులు పరిశీలించి... గుంతలో చేరిన నీటిని తొలగించి మరమ్మతు పనులు చేపట్టారు.
గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు