రంగారెడ్డి జిల్లా జల్పల్లి పరిధిలోని ఉస్మాన్‌నగర్.. వరద విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముంపునకు గురైన 465 ఇళ్లలో.. 350 ఇళ్లకు విముక్తి కలిగింది. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలతో స్థానికులు 2 నెలల అనంతరం ఊపిరి పీల్చుకుంటున్నారు.
రెండు నెలలుగా.. ముంపు ప్రాంతాల్లో ప్రజల నిత్యవసరాలను తీర్చేందుకు 20మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పేర్కొన్నారు. తమ సిబ్బంది.. కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు బ్లీచింగ్ పౌడర్, క్రిమి సంహారకాలు చల్లుతున్నారన్నారు. భాదితులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.