తెలంగాణ

telangana

ETV Bharat / state

హిమాయత్​ సాగర్​కు తగ్గిన వరద ప్రవాహం.. గేట్లు మూసివేత - హిమాయత్​ సాగర్​ ప్రాజెక్టు వార్తలు హైదరాబాద్​

హైదరాబాద్​లో వర్షాలు తగ్గుముఖం పట్టినందున.. జలాశయాల్లోకి వరద ప్రవాహం భారీగా తగ్గింది. వరద ఉద్ధృతి తగ్గడం వల్ల హిమాయత్​ జలాశయం గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్టులోని 350 క్యూసెక్కుల నీరు చేరగా.. ప్రస్తుత నీటిమట్టం 1763 అడుగులకు చేరుకుంది.

హిమాయత్​ సాగర్​కు తగ్గిన వరద ప్రవాహం.. గేట్లు మూసివేత
హిమాయత్​ సాగర్​కు తగ్గిన వరద ప్రవాహం.. గేట్లు మూసివేత

By

Published : Oct 24, 2020, 1:48 PM IST

Updated : Oct 24, 2020, 2:13 PM IST

రంగారెడ్డి జిల్లాలోని జలాశయాల్లోకి వరద ప్రవాహం భారీగా తగ్గింది. దీంతో హిమాయత్‌సాగర్ గేట్లు మూసివేశారు. జలాశయంలోకి 350 క్యూసెక్కుల నీరు చేరుతోంది. హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 1763 అడుగులుగా ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1787 అడుగులు.

అలాగే ఉస్మాన్​ సాగర్​లోని 150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్​ సాగర్​ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1787 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు.

ఇదీ చదవండి:భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలే..: మంత్రి నిరంజన్​రెడ్డి

Last Updated : Oct 24, 2020, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details